Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కన్నడ ఎన్నికల బరిలో టాలీవుడ్ నటుడు

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

Written By pnr
Updated: మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:11 IST)
కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు.
 
ఈయన మంగళవారం బీజేపీ అభ్యర్ధిగా చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆయనకు బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందిగ్ధం ఏర్పడింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. తొలుత స్థానికుడైన సి. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో సాయికుమార్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోగల యడ్యూరప్ప నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించి ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, చివరకు సాయికుమార్‌కే టిక్కెట్ కేటాయించారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments