Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై అల్లు అర్జున్ పోస్టు వైరల్.. ఏంటది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్, అల్లు‌అర్జున్‌ల మధ్య వైరం వుందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పూర్తి

Written By selvi
Updated: గురువారం, 7 జూన్ 2018 (11:50 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్, అల్లు‌అర్జున్‌ల మధ్య వైరం వుందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పూర్తిగా సీన్ మారిపోయింది.
 
శ్రీరెడ్డి వ్యాఖ్యల వివాదం దుమారం రేపడంతో పవన్ ఫిలిం ఛాంబ‌ర్‌ వద్ద చేపట్టిన నిరసనకి మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ అక్క‌డికి వచ్చారు. దీంతో పవన్, బన్నీల మధ్య ఎలాంటి వైరం లేదని తేలిపోయింది ఇటీవల బన్నీ కూడా రానున్న ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి సిద్ధమని ప్రకటించాడు. 
 
తాజాగా అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పవర్ స్టార్‌కి మద్దతు ప్రకటిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ''లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్‌నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్'' అని అల్లు అర్జున్ రాసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రజలకు సేవ చేయాలనే నీ పిచ్చికి తగినట్లు ప్రపంచమే సర్దుకుపోతుందనే అర్థం వచ్చేలా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో మెగా, పీకే ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments