Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మోసం గురూ... అమెజాన్‌లో ల్యాప్ టాప్ బుక్ చేస్తే పుస్తకం-ఇటుకలు వచ్చాయ్

Written By ఐవీఆర్
Updated: శనివారం, 30 జులై 2022 (18:02 IST)
ఆన్లైన్ మోసాలు హద్దులు మీరుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా వస్తువులు కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇదివరకు డబ్బు చెల్లిస్తే సరైన వస్తువు చేతికి అందుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. ఒకటి ఆర్డర్ చేస్తే పనికిమాలిన వస్తువులు చక్కగా ప్యాకింగులో ఇంటికి వచ్చేస్తున్నాయి. దీనితో బాక్సు తెరిచి చూసిన వినియోగదారుడు షాక్ తింటున్నాడు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

 
పాట్నా సిటీకి సమీపంలోని ఫత్వా ప్రాంతానికి చెందిన సౌరభ్ అనే యువకుడు ఓ ల్యాప్ టాప్ కోసం ఈ నెల 24న రూ. 34,600 చెల్లించి అమెజాన్ లో బుక్ చేసాడు. అమెజాన్ నుంచి అతడికి ల్యాప్ టాప్ పంపుతున్నట్లు సందేశంతో పాటు బాక్సు కూడా వచ్చేసింది. యువకుడు వ్యాపారం చేస్తుండటంతో కాస్తంత అలెర్టుగా బాక్స్ ఓపెన్ చేస్తున్న దగ్గర్నుంచి అంతా వీడియో తీసాడు.

 
బాక్స్ ఓపెన్ చేయగా అందులో ల్యాప్ టాప్ లేదు. పోలీసు రిక్రూట్మెంట్ గైడ్ ఒకటి, రెండు ఇటుక ముక్కలు పార్శిల్లో వున్నాయి. వీటిని చూసి షాక్ తిన్న యువకుడు వెంటనే ఆ వీడియో క్లిప్పును అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు అందుకున్న అమెజాన్ కస్టమర్ కేర్... ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేసిన సమాచారాన్ని అందిస్తామని రిప్లై ఇచ్చింది. మరి తప్పు ఎక్కడ జరిగిందో..?

అన్నీ చూడండి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా

Balakrishna: బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న విజయశాంతి?

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

కన్నడలో యష్‌ తో చేయాల్సింది - బాబీ నన్ను ఎంకరేజ్ చేశారు : డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల

Teja Sajja: ది ట్రెయిటర్స్ గేమ్ మిస్టరీ గా ఉంటుంది, జాంబీ రెడ్డి 2 చిత్రీకరిస్తున్నాం తేజ సజ్జ

తర్వాతి కథనం
Show comments