ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (22:45 IST)

డిప్రెషన్ ఈజ్‌ డ్రోయింగ్‌.. సుశాంత్‌ను వాడుకున్న ఫ్లిఫ్‌కార్ట్.. బాయ్ కాట్ అంటూ..

Flipkart
ప్రముఖ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి చిన్న వయసులోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు కొన్ని కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈయన మరణాన్ని కూడా ఫ్లిప్ కార్ట్ తమ లాభాలను కోసం ఉపయోగించుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కామర్స్ వెబ్ సైట్‌లో భాగంగా ఒక టీ షర్ట్‌పై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటో కనిపించడం అందరిని ఆగ్రహానికి గురిచేస్తుంది.
 
ఈ విధంగా టీ షర్ట్ పై సుశాంత్ ఫోటో ఉండడమే కాకుండా దాని కింద "డిప్రెషన్ ఈజ్‌ డ్రోయింగ్‌" అనే ట్యాగ్‌లైన్‌తో వాటిని అమ్ముతున్నారు. ఇదే పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి కారణమైంది. ఇది చూసిన సుశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లిప్‌కార్ట్‌ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. 
 
వ్యాపారం కోసం ఇంతగా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం బాయ్ కాట్ ఫ్లిప్‌కార్ట్‌ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.