మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (12:56 IST)

అమరావతి పాయె... దొనకొండ వచ్చే... నవ్యాంధ్ర రాజధానంటూ ప్రచారం (video)

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. ముఖ్యంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేసి అనేక విదేశీ ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చారు. 
 
కానీ, గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైకాపా గెలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో అమరావతిలో సీన్ రివర్స్ అయింది. టీడీపీ హయాంలో నిత్యం సందడిగా ఉండే అమరావతిలో ఇపుడు శ్మశాన శబ్దం వినిపిస్తోంది. 
 
అదేసమయంలో ఏపీ రాజధాని దొనకొండ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా భూముల ధరలు కొండెక్కాయి. ఏపీ రాజధాని అమరావతి అంశం ఇప్పుడు ఏపీ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని మారబోతుంది అని, త్వరలోనే ప్రకటన రాబోతుందని ప్రచారం జోరందుకుంది. 
 
ఏపీ రాజధాని దొనకొండకు మారుస్తున్న ట్లుగా ప్రచారం జరుగుతుండడంతో ఇక నేతల చూపులు దొనబండ సమీపంలోని భూములపై పడ్డాయి. దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు అటు పెద్ద నేతలే కాకుండా అయితే చోటామోటా నాయకులు కూడా ఎగబడుతున్నారు.