Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్చిన మాట ప్రకారం త్వరలో కొందరు మంత్రుల్ని తప్పిస్తున్న సీఎం జగన్: కొత్తవారెవరు?

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 11 మార్చి 2022 (19:26 IST)
వైసిపి అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ మాట చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులను ఇవ్వలేను కానీ కాస్తోకూస్తో సగం మంది దాకా మంత్రి పదవుల్లో వుండేట్లు చూస్తానన్నారు. ఐతే దీనికి ఓ ఫార్ములా చెప్పారు. అదేంటంటే... రెండున్నరేళ్లు కొందరు, మిగిలిన మరో రెండున్నరేళ్లు మరికొందరు... ఇలా రెండు దఫాలుగా మంత్రి పదవులు ఇస్తానని చెప్పారు. ఆ ప్రకారం రెండో దఫా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 
ఐతే ఇలా విస్తరణ చేసేటపుడు ముందుగా పనిచేసిన మంత్రుల్లో కొందరికి పదవులు పోయే అవకాశం వుంది. కానీ ఏడుగురు మంత్రుల పదవులకో ఢోకా లేదనే చర్చ జరుగుతుంది. వారిలో కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన, కన్నబాబులు వున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 
కాగా పదవులు కోల్పోయిన వారికి జిల్లా ఇంచార్జి పదవులు ఇస్తామనీ, వారంతా పార్టీ కోసం పనిచేయాలని సూచన చేసారు. మరోవైపు ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం వున్న నేపధ్యంలో సీఎం జగన్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments