Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుకోవడం అంటే ఏమిటి? శ్రీరెడ్డిని చెప్పుతో కొడతా...

నటి శ్రీరెడ్డి సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై మరో నటి సత్య ఆగ్రహం వ్యక్తం చేసారు. పడుకోవడం అంటే ఏమిటి... అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ

Written By ivr
Updated: శనివారం, 24 మార్చి 2018 (21:02 IST)
నటి శ్రీరెడ్డి సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై మరో నటి సత్య ఆగ్రహం వ్యక్తం చేసారు. పడుకోవడం అంటే ఏమిటి... అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ మండిపడింది. ఆమె మాటల్లోనే... '' నాకు శ్రీరెడ్డి ఎవరో తెలీదు. ఆమె మాటలు చూస్తుంటే నైట్ నైట్ స్టార్‌డం తెచ్చుకోవాలనిపిస్తున్నట్లుంది. రెండ్రోజుల నుంచి చూస్తున్నా. ప్రతి ఆర్టిస్టు కూడా ఆమె మాటలకు మండిపడుతున్నారు. అసలు పడుకోవడం ఏంటండీ.. ఆమె అసలు ఆడదేనా?
 
బాధ వుంటే చెప్పమ్మా. నువ్వెళ్లే రూట్ మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఆర్టిస్టు పడుకోవాల్సిందే అంటున్నావు నువ్వేమైనా పక్కనుండి చూశావా. ఆ మాటలకు చెప్పు తీసుకుని కొట్టాలి. నోటి దూల వుందా తీర్చుకో. మరేదో వుందా తీర్చుకో. దర్శకుడు, నిర్మాతల గురించి చెడ్డగా మాట్లాడకు. నీ డ్రెస్ సెన్స్ గురించి నువ్వు చూస్కుంటున్నావా.
 
తెలుగు ఇండస్ట్రీకి నువ్వు చెప్పినట్లు ఆ ఖర్మేమీ పట్టలేదు. ఎవడో మోసం చేశాడని అందరినీ అంటావా, చెంపలు పగులకొడతా. ఇష్టం లేకపోతే పట్టుకెళ్లిపోయి రేప్ చేసేవాళ్లయితే లేరు. ఆంధ్రలో కొట్టుకు చస్తున్నారు ప్రత్యేక హోదా కోసం... వెళ్లి పోరాడు'' అంటూ సత్య వ్యాఖ్యానించారు.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments