శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 మార్చి 2018 (21:08 IST)

హాట్ యాంకర్ అనసూయ అలా అయితే... సాక్షి మాజీ టీవీ యాంకర్ శ్రీరెడ్డి ఇలా ఎందుకైంది?

శ్రీరెడ్డి.. ఒకప్పుడు సాక్షి టీవీలో యాంకర్. అంతకుముందు ఆమె పేరు విమల. పుట్టింది విజయవాడలోనే. ఐతే తన కలలన్నీ సినిమాల పైనే. అందుకే హీరోయిన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయింది. ఓ రోజు హీరోయిన్ల మాదిరిగా పెదవులకు ఎర్రని రంగు వేసుకుంది. ఆమె అలా పెదాలకు ఎర్ర రంగ

శ్రీరెడ్డి.. ఒకప్పుడు సాక్షి టీవీలో యాంకర్. అంతకుముందు ఆమె పేరు విమల. పుట్టింది విజయవాడలోనే. ఐతే తన కలలన్నీ సినిమాల పైనే. అందుకే హీరోయిన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయింది. ఓ రోజు హీరోయిన్ల మాదిరిగా పెదవులకు ఎర్రని రంగు వేసుకుంది. ఆమె అలా పెదాలకు ఎర్ర రంగు వేసుకునేసరికి ఆమె తల్లి కొట్టింది. ఐతే ఆమెలో జనించిన హీరోయిన్ కోర్కెను మాత్రం ఆమె తరిమివేయలేకపోయింది. పేరెంట్స్ భయంతో ఎలాగో ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీ రెడ్డి నేరుగా హైదరాబాద్ బాట పట్టింది. 
 
రంగుల ప్రపంచంలో పడిపోయింది. ఎలాగైనా హీరోయిన్ కావాలని గట్టి పట్టుదల పట్టింది. కానీ అవకాశాలు అంత తేలిక కాదు కదా. ఇంతలో 2009లో సాక్షి టీవీ చానల్ ప్రారంభమైంది. అప్పట్లో సాక్షిలో చేరి అనసూయ, గాయత్రి గుప్తతో పాటు మంచి పేరు తెచ్చుకుంది. ఎవరు చెప్పారో కానీ తన పేరును శ్రీలేఖగా మార్చుకుని సాక్షిలో హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. చేతులు, నడుముపై టాటూలు వేసుకుని హీటెక్కించే రీతిలో మాట్లాడుతుండేది. 
 
హఠాత్తుగా సాక్షి టీవీలో యాంకర్ పోస్టుకు రిజైన్ చేసి బయటకు వచ్చేసింది. ఆమెతో పాటుగా ఆమె హాట్ ఫోటోల కూడా బయటకు వచ్చేశాయి. నేనూ మా నాన్న అబద్ధం చిత్రంలో నటించింది. అది 2011లో విడుదలైనా ఆడలేదు. ఆ తర్వాత తన ఫోటోషూట్ చేసుకుని వాటిని పట్టుకుని స్టూడియోలు చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. జిందగీ అనే చిత్రంలో చాన్స్ వచ్చినా ఆమెను సక్సెక్ మాత్రం వరించలేదు. దాంతో మూడు చిత్రాల వద్దే ఆగిపోయింది. 
 
ఫేస్ బుక్‌లో ఆమెకు 6 మిలియన్ ఫాలోయర్లు వున్నా పెద్దగా కలిసి వచ్చింది లేదు. సినిమా ఆఫర్లు మాత్రం రాలేదు. దీనితో బోల్డ్ స్టేట్మెంట్లతో బాగా పాపులరైంది. బ్లూ ఫిలిమ్‌లు ఆపేస్తే కుర్రాళ్లు రోడ్లపై పడతారనీ, ప్రతి ప్రాంతంలో రెడ్ లైట్ ఏరియాలు వుండాలనే కామెంట్లు చేసి చర్చలు జరిగేట్లు చేసింది. కానీ అవి కూడా ఆమెకు మాత్రం అవకాశాలు తీసుకురాలేదు. పోనీ తిరిగి యాంకర్ వృత్తిని సాగిద్దామనుకుంటే అక్కడ తలుపులు క్లోజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ప్రస్తుతం శ్రీరెడ్డి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమందిని తూర్పారబడుతోంది.