Dharma Sangrah
✕

వాజ్‌పేయికి డయాలసిస్... నిలకడగా ఆరోగ్యం... హెల్త్ బులిటెన్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగావుంది. ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డయాలసిస్ చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడినట్టు ఎయిమ్స్ వైద్యవర్గాలు

Written By pnr
Updated: మంగళవారం, 12 జూన్ 2018 (17:40 IST)
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగావుంది. ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డయాలసిస్ చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడినట్టు ఎయిమ్స్ వైద్యవర్గాలు వెల్లడించాయి.
 
కాగా, సోమవారం రోటీన్ హెల్త్ చెకప్‌ కోసం వాజ్‌పేయిని సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. 
 
అయితే, ఆయనకు డయాలసిస్ చేశాక.. ఆరోగ్యం కుదుటపడినట్టు సమాచారం. ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం వైద్య బులిటెన్‌ను విడుదల చేశారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు వాజ్‌పేయి స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్ కొనసాగిస్తున్నామని తెలిపింది. వాజ్‌పేయికి ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అయ్యేవరకు ఆస్పత్రిలో ఉంటారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వాజపేయి తాజాగా కిడ్నీ, ఊపిరితిత్తులు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. దీంతో ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేర్చారు. ఐసీయూలో చేర్చిన వైద్యులు డయాలసిస్ సేవలందిస్తున్నారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 
 
ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సారథ్యంలో ఒక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది. రణ్‌దీప్ గులేరియా మూడు దశాబ్దాలుగా వాజపేయి వ్యక్తిగత వైద్యుడిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments