Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహంలో వధువు ఆశీర్వాదం తీసుకున్న వరుడు.. వీడియో వైరల్

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:32 IST)
మన సమాజం వివాహజీవితం మొదలునుంచే పురుషుడికి లోబడి నడుచుకోవాలని సూచిస్తుంది. నిజానికి, సాంప్రదాయ వివాహాలలో జరిగే అనేక పద్ధతులు పితృస్వామ్యమైనవే. ఉదాహరణకు.. ఒక స్త్రీ పెళ్లికాగానే తన భర్త ఇంటికి వెళ్ళటానికి తన సొంత ఇంటిని విడిచిపెట్టాలనేది అందరికీ తెలిసిన విషయమే. 
 
అలాగే, పెళ్లి పందిట్లో వధువు తన భర్త పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంటారు. చెప్పిన వాటికి తలవంచుతూ, గౌరవిస్తూ సర్దుకుపోయే గుణాన్ని స్త్రీ మాత్రమే అలవర్చుకోవాలనే సూచలను అధికంగా చేరవేస్తుంటారు. అయితే, కొన్ని జంటలు మాత్రం ఈ సంప్రదాయాలలో సమానత్వం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
వధువు ఆశీర్వాదం... ఇటీవల ఒక బెంగాలీ వివాహంలో వధువు వరుడి ఆశీర్వాదం తీసుకున్న తరువాత, వరుడు కూడా వధువు ఆశీర్వాదానికి మోకాళ్లపై వంగి కూర్చుని ఆమెకు నమస్కరించాడు. వధువు ఆశీర్వాదం తర్వాత వరుడు నిలుచున్నాడు.
 
స్త్రీ-పురుష సమానత్వం, గౌరవం అనేవి మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపడం అని నిరూపించిన ఈ పెళ్లి వీడియో ఇటీవల బాగా వైరల్‌ అయ్యింది. దంపతులిద్దరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమను పంచుకునే విధానాన్ని ఈ పద్ధతి సూచిస్తుందని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.  

అన్నీ చూడండి

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

Suri: నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారు : సూరి

తర్వాతి కథనం
Show comments