Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మంత్రుల రాజీనామాలను చూసి ఉద్వేగానికి లోనైన సీఎం జగన్

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వేగానికి లోనైనట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా పలువురు మంత్రులు తమతమ రాజీనామాలను సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. ఆ సందర్భంగా మంత్రులు సీఎం జగన్‌తో మాట్లాడుతూ... మా మంత్రి పదవులతో వున్న లెటర్ హెడ్లను సంబంధిత అధికారులకు ఇచ్చేసాం అంటూ చెప్పుకొచ్చారు.

 
ఆ మాటలను విన్న సీఎం జగన్ ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు సమాచారం. ఆ సందర్భంగా మాట్లాడుతూ... మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి తీసేయాలని ఈ పని చేయడంలేదు. పార్టీ బలోపేతానికి ముందుగా అనుకున్న మాట ప్రకారం,  ఆ మాటకు కట్టుబడి ఈ పని చేస్తున్నా అంటూ భావోద్వేగానికి లోనైట్లు తెలిసింది.

 
ఇంకా సీఎం మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం వున్న 151 సీట్ల సంఖ్యకు ఎంతమాత్రం తగ్గకూడదు. ఈ సంఖ్య కంటే కాస్తోకూస్తో ఎక్కువ సీట్లు రాబట్టుకోవాలి. అందుకోసం మీరంతా నాకోసం, పార్టీ కోసం పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే... ఇక భవిష్యత్తులో మనకు తిరుగే వుండదు.

 
ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నవారికి కేబినెట్ హోదా తగ్గకుండా జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటికి అధ్యక్షులుగా నియమించే ఆలోచన చేస్తున్నాం. ఆ ప్రకారం మీరు మంత్రులగా వున్నప్పటి హోదాకి ఏమాత్రం తగ్గకుండా చూసేందుకు యత్నిస్తున్నా. మంత్రి పదవి పోయిందని ఎంతమాత్రం నిరాశగా వుండొద్దు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ మీరు మంత్రులవుతారు అంటూ రాజీనామాలు సమర్పించిన మంత్రులతో సీఎం జగన్ అన్నట్లు తెలిసింది.

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments