Daily Horoscope
✕

అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)

Written By సెల్వి
Updated: మంగళవారం, 1 సెప్టెంబరు 2026 (14:14 IST)
Wedding
అమెరికాలో అమ్మాయి పెళ్లికి వెళ్లలేకపోయారు.. ఆ తల్లిదండ్రులు. దీంతో ఆంధ్రా అబ్బాయితో అమెరికాలో కుమార్తె పెళ్లి జరిపించారు. పెళ్లి ఆన్‌లైన్‌లోనే జరిగింది. అక్షింతలు కూడా టీవీలో కనిపిస్తున్న వధూవరులపై చల్లారు.. ఆ తల్లిదండ్రులు. వీడియో కాల్ ద్వారానే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కట్ చేస్తే.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె హిమబిందు. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ అమెరికాలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించాలని భావించిన జయరాజు, జ్యోతి దంపతులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, వీసా సంబంధిత సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో వారు నిరాశకు లోనైనా.. టెక్నాలజీ సాయంతో వారు తమ కుమార్తె వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. అమెరికాలో హిమబిందు, రోహిత్‌ల వివాహం జరుగుతుండగా, స్వగ్రామంలోని తమ నివాసం నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు.

కళ్లారా కూతురి పెళ్లిని చూడలేకపోయామన్న బాధ ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌లోనే నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. అంతేకాకుండా, బంధుమిత్రులు, గ్రామస్థుల కోసం తమ గ్రామంలో ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

కేవలం 25 రోజుల్లో చిత్రీకరణ జరిగేలా ఓరి నాయనో చిత్రం ప్రారంభమైంది

cult movie review: మితిమీరిన హింస, రక్తపాతం కాన్సెప్ట్ గా విశ్వక్ సేన్.. కల్ట్ రివ్యూ

సమంత ప్రెగ్నెన్సీ డైరీ.. ఫిట్‌నెట్ అదుర్స్.. వీడియో వైరల్

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

తర్వాతి కథనం
Show comments