Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంటిని కాపాడలేని వారు దేశాన్ని ఎలా?: నితిన్ గడ్కరీ

Updated: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:39 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు.. దేశాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఓటమిని అంగీకరించాలన్నారు. తాజాగా నాగపూ‌లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తన జీవితాన్ని దేశానికి అంకితం చేద్దామనుకుంటున్నానని చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు. అలా ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు అతడి వివరాలను ఆరా తీశాను. అతనో దుకాణాన్ని నడపలేక దాన్ని మూసేసినట్లు విన్నాను. అంతేగాకుండా అతనికి భార్యాపిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదని అతని మాటలను బట్టి తెలుసుకున్నాను. 
 
అందుకే ముందు ఇంటి గురించి పట్టించుకోమని చెప్పానని నితిన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇంటిని సరిగ్గా నడపలేని వ్యక్తి దేశాన్నెలా బాగు చేస్తాడని ప్రశ్నించాడు. అందుకు ముందు కుటుంబం, పిల్లల గురించి ఆలోచించండి.. తర్వాత పార్టీ గురించి ఆలోచిద్దామని ఆ కార్యకర్తకు చెప్పినట్లు నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments