బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:23 IST)

కికి ఛాలెంజ్ కిక్ ఇవ్వదు.. కటకటాల వెనుక డ్యాన్స్ చేయిస్తుంది : బెంగుళూరు కాప్స్ వార్న్

సోషల్ మీడియా పుణ్యమాని 'కికి' ఛాలెంజ్ వైరల్ అయింది. పలువురు అకతాయిలతో పాటు హీరోయిన్లు సైతం ఈ 'కికి' ఛాలెంజ్‌లో పాల్గొంటుండటంతో దీనికి విస్తృతప్రచారం లభించింది. అయితే, ఈ తరహా ఛాలెంజ్ ప్రాణాపాయమని, ఇతరు

సోషల్ మీడియా పుణ్యమాని 'కికి' ఛాలెంజ్ వైరల్ అయింది. పలువురు అకతాయిలతో పాటు హీరోయిన్లు సైతం ఈ 'కికి' ఛాలెంజ్‌లో పాల్గొంటుండటంతో దీనికి విస్తృతప్రచారం లభించింది. అయితే, ఈ తరహా ఛాలెంజ్ ప్రాణాపాయమని, ఇతరులకు కూడా ఇబ్బందిగా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది సెలెబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ ఫీట్లు చేస్తూనేవున్నారు.
 
ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో కికిపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ చేసిన నటి రెజీనాకు హైదరాబాద్ పోలీసులు గట్టిగానే హెచ్చరించారు కూడా. ఇక బెంగళూరు పోలీసులు కాస్తంత విభిన్నంగా నెటిజన్లను హెచ్చరిస్తూ, కికి ఛాలెంజ్ స్వీకరించి, డ్యాన్స్ చేయాలంటే కటకటాల వెనకే చేయాల్సి వస్తుందన్నారు. 
 
ఈ మేరకు బెంగళూరు పోలీసు శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖతాలో ఓ పోస్టు పెట్టింది. 'మీరు రోడ్లపై కికి ఛాలెంజ్ నృత్యం చేస్తే కనుక... కటకటాల వెనుక మీరు డ్యాన్స్ చేసేలా చూస్తామని మేము హామీ ఇస్తున్నాం. కికి ఛాలెంజ్ మీకు డ్యాన్స్ కిక్కు ఇవ్వదు సరికదా, చట్టం పవర్‌ను చూపిస్తుంది' అంటూ ఘాటైన హెచ్చరికలు చేశారు. 
 
కికిలో భాగంగా నడుస్తున్న వాహనం నుంచి దిగి, నృత్యం చేసి, ఆపై మళ్లీ దాన్ని ఎక్కడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, చట్టప్రకారం ఇది శిక్షించదగ్గ నేరమని పోలీసులు వివరణ కూడా ఇస్తున్నారు.