సెక్స్ డాల్‌తో హనీమూన్: బాడీ బిల్డర్ ఫోటోలు షేర్
కజకిస్థాన్ బాడీబిల్డర్ యూరి టోలోచ్కో హనీమూన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే... 36 ఏళ్ల రెజ్లర్ తన రెండో సెక్స్ డాల్‌తో హనీమూన్‌కు వెళ్లడమే. అతను 'లూనా' అనే సెక్స్ డాల్‌తో బల్గేరియన్ హనీమూన్‌లో ఉన్నాడు. డాల్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది బాగా వైరల్ అవుతోంది.
యూరీ అంతకుముందు 'మార్గట్' అనే సెక్స్ డాల్‌ను కొన్నాడు. ఐతే దాన్ని వదిలేసి తాజాగా అతను లూనాతో కలిసిపోయాడు. తను చాలా కాలంగా లూనాతో కలిసి ఉన్నానని, అయితే కరోనా వైరస్ కారణంగా హనీమూన్‌ను ఆస్వాదించలేకపోయానని యూరి చెప్పాడు. వ్యాపారం కోసం బల్గేరియాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు, అతను తనతో పాటు లూనాను తీసుకెళ్లాడు.
బల్గేరియాలో అతను లూనాతో కలిసి డిన్నర్, లంచ్‌కి కూడా వెళ్ళాడు. రెస్టారెంటులో ఉన్న అందరిచూపు ఈ ఇద్దరిపై పడింది. ఇంకేముందు సెక్స్ డాల్ లూనా, యూరిలతో తెగ సెల్ఫీలు దిగారు.