Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ వంటి సీఎంను నేనెక్కడా చూడలేదు: బాబా రాందేవ్

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనలు అద్భుతమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యంగా, కేసీఆర్

Written By pnr
Updated: శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:23 IST)
రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనలు అద్భుతమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యంగా, కేసీఆర్ ముందుచూపు ఉన్న నేత అని యోగా గురువు కొనియాడారు. 
 
బాబా రాందేవ్ గురువారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌‌కు వచ్చిన బాబా రాందేవ్‌‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. కారు వద్దకు వచ్చి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా తోడ్కొని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. మెమెంటోను అందించారు. ఆ తర్వాత వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు.
 
అనంతరం సీఎంతో ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించిన బాబా రాందేవ్ అనంతరం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న నేత అని, రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్పష్టత ఉందని ట్వీట్ చేశారు. రైతులపై, గ్రామీణ, ఆర్థిక, న్యాయవ్యవస్థలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆలోచనల్లో స్పష్టత, దూరదృష్టి కనిపించిందని రాందేవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
'తెలంగాణ రైతులకు ఏది కావాలో కేసీఆర్‌ అది చేస్తున్నారు. ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసే సీఎం ఆలోచన అద్భుతం' అని రాందేవ్‌ కొనియాడారు. ఉత్పాదక రంగమైన వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని, రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments