ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2024 (16:40 IST)

Jai Sriram, అయోధ్యలో బాలరామునికి అద్భుత సూర్యతిలకం

Surya Thilak to Ram lulla
అయోధ్యలో బాలరామునికి అద్భుతంగా సూర్యతిలకం దిద్దబడింది. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో ఉన్న రామ లల్లా నుదుటిపై 'సూర్య తిలక్' దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఆయా మాధ్యమాల ద్వారా దర్శించుకున్నారు. 
 
రామ్ లల్లా సూర్య తిలకంతో అభిషేకం చేస్తున్న సందర్భంలో అస్సాంలోని నల్బరీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ప్రస్తావించారు. ‘జై శ్రీరామ్‌’ నినాదాల మధ్య ప్రధానమంత్రి “ఈరోజు రామ నవమి చారిత్రాత్మక సందర్భం. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, రాముడు తన గొప్ప ఆలయంలో కొలువై వున్నాడు. శ్రీరాముడికి సూర్య తిలకం దిద్దడంతో ఆయన జయంతిని పవిత్ర నగరమైన అయోధ్యలో, రామాలయంలో జరుపుకుంటున్నారు అని అన్నారు.
 
రామజన్మభూమి రెండవసారి బ్రహ్మాండమైన ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత సుమారు 500 ఏండ్ల తర్వాత గొప్ప వేడుకను జరుపుకుంటుంది. రామమందిరంలో 56 రకాల భోగ్‌లు, ప్రసాదాలు, పంజిరీలతో రామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.
 
సూర్య తిలకం వెనుక సైన్స్: రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) శాస్త్రవేత్తలు సూర్యుని గమనం ఆధారంగా సూర్య తిలకం యొక్క సమయాన్ని లెక్కించారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. "రామ్ లల్లా 'సూర్య అభిషేక్' అధిక-నాణ్యత అద్దాలు, లెన్స్‌లతో కూడిన ఆప్టోమెకానికల్ సిస్టమ్‌ను ఉపయోగించి ప్రదర్శించబడుతుంది" అని ట్రస్ట్ తెలిపింది. ఆ ప్రకారంగా ఈరోజు అయోధ్యలో బాలరాముని నుదుటిపై సూర్యతిలకం సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడి కిరణాల ద్వారా దిద్దబడింది.