ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (20:05 IST)

కిరణ్ బేడీ వీడియో.. మళ్లీ ట్రోలింగ్ మొదలు.. తిమింగలం హెలికాప్టర్‌ను..?

Sharks
పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఒక వీడియోను షేర్ చేసినందుకు ట్రోలింగ్ గురవుతున్నారు. ఇది భారీ సొరచేప నీటిలో నుండి పైకి దూకి హెలికాప్టర్‌ను కిందకు లాక్కుంది. రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అయిన ఈ క్లిప్‌ను ఈ రోజు షేర్ చేసుకున్నారు.
 
ఈ వీడియో కింద నేషనల్ జియోగ్రాఫిక్ వీడియో హక్కుల కోసం మిలియన్ డాలర్లు వెచ్చించిందంటూ అందులో టెస్ట్ రాసుకొచ్చారు.
 
వీడియోలో నమ్మలేనంత ఎత్తుకు ఎగిరింది తిమింగళం. అక్కడే కొందరు షిప్‌లో నిలబడి చూస్తుండగా ఈ ఘటన జరిగింది. నీటి మీద కాస్త ఎత్తులో ఉన్న హెలికాప్టర్‌ను అందుకుని నీళ్లలోకి లాగేసుకుంది. మంటలతోనే మునిగిపోయింది హెలికాప్టర్. ఈ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 
 
కిరణ్ బేఢీ షేర్ చేసిన వీడియోలు ట్రోలింగ్ గురికావడం కొత్తేం కాదు. జనవరి 2020లో, ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక నకిలీ వీడియోను షేర్ చేసింది. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా రికార్డ్ చేసిన సూర్యుని ధ్వనిలో "ఓం" శబ్ధాలు వినిపిస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.