గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (22:17 IST)

అంతరిక్షం నుంచి టిక్ టాక్ వీడియో.. వ్యోమగామి సూపర్ రికార్డ్ (వీడియో)

Samantha Cristoforetti
Samantha Cristoforetti
టిక్ టాక్ వీడియోల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. టిక్ టాక్ వీడియోల కోసం చాలామంది టిక్ టాకర్లు రెడీగా వున్నారు. అయితే అంతరిక్షం నుంచి టిక్ టాక్ వీడియో చేయడం వింటే అందరికీ షాక్ కాక తప్పదు. అవును.. మీరు చదువుతున్నది నిజమే. 
 
ఇటీవల స్పేస్‌ఎక్స్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఇటీవల అంతరిక్షం నుండి ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ వ్యోమగామి ఏప్రిల్ 27న సమంతా క్రిష్టోపోరెట్టి ఆరు నెలల బస కోసం కక్ష్యలో ఉన్న ల్యాబ్‌లో దిగారు. అయితే దానికి సంబంధించిన విషయాలను టిక్ టాక్ వీడియో ద్వారా మే 5న పోస్ట్ చేశారు. 
Samantha Cristoforetti
Samantha Cristoforetti
 
దీంతో అంతరిక్షంలో మొట్టమొదటి టిక్‌టాకర్‌గా రికార్డ్ సృష్టించగా.. అందులో రెండు జీరో-జి సూచికలు, ఎట్టా అనే కోతి బొమ్మను చూపిస్తూ 88 సెకన్లపాటు రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.