మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:50 IST)

లాక్ డౌన్, ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా డబ్బు వెదజల్లుతారనీ....

కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం హెలికాప్టర్ల ద్వారా నగదు పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు నకిలీ వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం శిక్షతో కూడినదని అధికారులు పేర్కొన్నారు.
 
దేశంలో లాక్ డౌన్ కారణంగా హెలికాప్టర్ల నుంచి డబ్బును ప్రజలకు వదలాలని మోడీ ఆదేశించినట్లు కర్ణాటకలోని ఒక టీవీ ఛానల్ తెలిపింది. దీనితో చాలామంది గ్రామస్తులు ఆకాశం వైపు కళ్ళు పెట్టుకుని హెలికాప్టర్ కోసం ఎదురుచూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నకిలీ వార్తా కథనానికి సంబంధించి వివరణ కోరుతూ అధికారులు ఛానెల్‌కు నోటీసు పంపారు. ఛానెల్ వివరణ ఇచ్చేందుకు 10 రోజులు ఇవ్వబడింది.