బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (09:18 IST)

ఓటర్లు సమ్మర్ హాలిడేస్‌కు వెళ్లడం వల్లే ఓడిపోయాం : లక్ష్మీనారాయణ

ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయి

ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయినట్టు లక్ష్మీనారాయణ చౌదరి అనే మంత్రివర్యులు సెలవిచ్చారు.
 
ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నుపూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. బీజేపీ సర్కారుపై వ్యతిరేకతే ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతుండగా, అబ్బే అలాంటిదేమీ లేదని యోగి కేబినెట్‌లోని ఓ అమాత్యుడు సెలవిచ్చారు. 
 
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ నిజానికీ ఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు ఎంతమాత్రమూ గీటురాయి కావన్నారు. 
 
పిల్లాపాపలతో కలిసి తమ ఓటర్లు వేసవి సెలవులకు వెళ్లడంతోనే తాము ఓడిపోయామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగదని, ఓటర్లంతా కమలం గుర్తుకే ఓటు వేస్తారంటూ ఆయన సెలవిచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు.