శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (09:02 IST)

పంజా విసరడానికి కూడా శక్తికావాలి: బైపోల్ రిజల్ట్స్‌పై రాజ్‌నాథ్

దేశంలో వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనదైనశైలిలో స్పందించారు. సింహం పంజా విసరడానికి కూడా శక్తి కావాల్సి ఉంటుందన్నారు.

దేశంలో వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనదైనశైలిలో స్పందించారు. సింహం పంజా విసరడానికి కూడా శక్తి కావాల్సి ఉంటుందన్నారు. గురువారం వెల్లడైన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, 'ముందుకు లంఘించి దూకడానికి శక్తి కోసం ఎవరైనా రెండడుగులు వెనక్కి వేయాల్సిందే. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలూ అలాంటివే. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి కూడా అలాంటిదే' అని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, బీహార్‌లో అధికార జేడీయు అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడంపై ఆ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీపై నిందలు మోపుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు.. దాని మిత్రపక్షాలు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా, పెట్రోలు ధరలు పెరుగుదల ప్రధానంగా ఉందన్నారు. 
 
పైగా, దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులు అల్లాడుతున్నారు. ఆ ప్రభావమే బీహార్‌లోనూ పడింది. పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.