మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 జులై 2025 (17:46 IST)

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Maharashtra dog walker
Maharashtra dog walker
మహారాష్ట్రకు చెందిన ఓ డాగ్ వాకర్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిగ్రీలు చేసుకుంటూ పోతే ఉద్యోగాలు భలే వచ్చేస్తాయని నమ్ముతున్న నేటి యువతకు ఆ డాగ్ వాకర్ తానేంటో నిరూపించుకుని స్ఫూర్తిగా నిలిచాడు. డాగ్ వాకర్‌గా లక్షలు సంపాదిస్తున్నాడు. వైద్యులు ఆర్జించే జీతం కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో అతను రూ.4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. 
 
ఈ డాగ్ వాకర్ సోదరుడు ఎంబీఏ గ్రాడ్యుయేట్, నెలకు కేవలం 70వేలు మాత్రమే సంపాదిస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి తన సోదరుడి కంటే 6 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఈ మేరకు రోజూ 38 కుక్కలను వాకింగ్ తీసుకెళ్తాడు. రెండు రోజువారీ నడకలకు ఒక్కో కుక్కకు రూ.15,000 వసూలు చేస్తాడు. దీంతో అతని స్థూల ఆదాయం మొత్తం రూ.5.7 లక్షలు కాగా, ఖర్చుల తర్వాత అతని నికర టేక్-హోమ్ దాదాపు రూ.4.5లక్షలు. 
 
పెంపుడు జంతువుల ప్రేమికులకు చెందిన 38 కుక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఉదయం, సాయంత్రం నడకలతో పాటు అతను కుక్కల ఫిట్‌నెస్, శ్రేయస్సును కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. దీంతో అతనికి డిమాండ్‌ కూడా చాలా పెరిగింది. విలాసవంతమైన ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ పెంపుడు జంతువుల కోసం రాజీపడరు. అందుకే వారు అతని సేవ కోసం చాలా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. 
 
ఈ ఆలోచనను డాగ్ వాకర్ క్యాష్ చేసుకుంటున్నాడు. కాగా.. భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, 2026 నాటికి రూ.7,500 కోట్లు దాటుతుందని అంచనా వేయడంతో, ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్స్, పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను చాలామంది క్యాష్ చేసుకునే పనిలో పడతారని అంచనా.