సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ఒక్క యేడాదిలో 8428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి!

idli
అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విగ్గీ ఫుడ్ డెలివరీ కంపెనీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి ఒక యేడాదిలో 8428 ప్లేట్ల ఇండ్లీలను ఆర్డర్ చేసినట్టు వెల్లడించింది. ఈ ఇడ్లీలను కూడా బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లినపుడు ఆర్డర్ చేసినట్టు తెలిపింది. 
 
గత యేడాదిలో ఆయన ఏకంగా రూ.6 లక్షల విలువైన ఇడ్లీలను కొనుగోలు చేశాడు. తన కుటుంబానికి, స్నేహితులకు కలిపి ఆయన ఏకంగా 8428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు. గురువారం అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 మార్చి 30వ తేదీ నుంచి 2023 మార్చి 25వ తేదీ వరకు జరిగిన ఆర్డర్ల ఆధారంగా స్విగ్గీ ఈ వివరాలను బహిర్గతం చేసింది. గత 12 నెలల్లో 33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీ డెలివరీ చేసిందని తెలిపింది. 
 
ఇడ్లీలను ఎక్కువగా ఆర్డర్ చేసిన నగరాల్లో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయని తెలిపింది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కోయంబత్తూరు, ముంబై నగరాల్లో భోజన సమయాల్లో కూడా ఇడ్లీని ఆర్డర్ చేస్తున్నారు. బెంగుళూరులో రవ్వ ఇడ్లీకి మంచి ఆదరణ ఉంది. తెలంగాణా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నెయ్యి ఇడ్లీ, నెయ్యి కారంపొడి ఇడ్లీకి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఆహార డెలివరీ ఫ్లాట్‌ఫాం అయిన స్విగ్గీ తెలిపింది.