శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (10:24 IST)

ఒకే ఇంట్లో తల్లి, అమ్మమ్మ, అత్తమ్మ అందరూ ప్రెగ్నెంట్.. ఫోటో వైరల్

Pregnant
Pregnant
కేరళలో ఓ గర్భిణితో తల్లి, అమ్మమ్మ, అత్తగారు కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. నేటి ఆధునిక ఇంటర్నెట్ యుగంలో, ప్రతి ఒక్కరూ ప్రతి ఈవెంట్‌లో ఫోటోలు తీయాలని కోరుకుంటారు. అలాంటి ఫోటోలన్నీ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను, సంతోషకరమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి సహాయపడతాయి. 
 
ఈ రోజుల్లో పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం, చెవులు కుట్టించుకోవడం, నామకరణం వంటి కార్యక్రమాలకు ఫోటోషూట్‌లు చేయడం సర్వసాధారణం. 
 
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మెటర్నిటీ ఫోటోషూట్ పాపులర్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ నిర్వహించింది. ఇందులో ఆమె అత్తగారు, అమ్మ, అమ్మమ్మ ఇలా అందరూ ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టుండి మేకప్ వేసుకుని ఫోటో షూట్ నిర్వహించారు. అది వైరల్ అవుతోంది.