గురువారం, 7 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జులై 2022 (14:33 IST)

ముంబైలో భారీగా వర్షాలు.. భుజాలకు స్విగ్గీ బ్యాగ్.. గుర్రంపై డెలివరీ

Swiggy employee delivers
Swiggy employee delivers
ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైల్వేస్టేషన్లలో భారీగా వరద నీరు  వచ్చిచేరింది. ఈ నేపథ్యంలో స్విగ్గీ లోగోతో ఉన్న బ్యాగ్‌ను భుజాలకు తగిలించుకున్న వ్యక్తి గుర్రం ఎక్కి ముంబై నడిరోడ్డులో.. వర్షానికి తడుస్తూ వెళుతున్న వీడియో ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే ఎక్కువ మందికి వచ్చిన అనుమానం. పెద్ద ఎత్తున నెటిజన్లు దీనికి స్పందిస్తున్నారు. దీంతో స్విగ్గీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు.
 
గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. దయచేసి ఆయన ఎవరో తెలిస్తే చెప్పండి. ఇంకా ఉత్తమ భారత పౌరుడిగా అతనిని అభినందించేందుకు సహకారం అందించండి" అని స్విగ్గీ పేర్కొంది.