Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌పై నిషేధం విధించిన ఆ దేశం... ఎందుకో తెలుసా?

Written By సెల్వి
Updated: శనివారం, 5 జూన్ 2021 (10:55 IST)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా హవా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో ట్విట్టర్ ఒకటి. భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ట్విట్టర్.. తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. ఈ విషయంపై కేంద్రం, ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. 
 
ఇదిలావుంటే, తాజాగా ఆఫ్రికాలోని నైజీరియా సర్కారు మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్ ట్విట్టర్​పై సస్పెన్షన్ వేటువిధించింది. ట్విట్టర్​ను సస్పెండ్​ చేసినట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా దేశ అధ్యక్షుడు ట్వీట్​ను తొలగించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వమే ప్రకటించింది.
 
నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ దేశంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. దేశంలోని ఆగ్నేయం ప్రాంతంలో నివసించే కొంతమందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు అధ్యక్షుడు బుహారీ ట్వీట్ చేశారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా వివాదాలకు కారణమవుతుండడంతో ట్విట్టర్ ఆ ట్వీట్‌ను​ బుధవారం తొలగించింది. 
 
బుహారీ పోస్ట్​ను డిలీట్ చేసిన కారణంగా ట్విటర్​ను బ్యాన్ చేస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి లాయి మహమ్మద్ తెలిపారు. అది కూడా ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తున్నామని ట్విట్టర్‌లోనే పేర్కొనడం మరో వివాదంగా మారింది.
 
నిజానికి ట్విట్టర్ బ్యాన్‌పై ఆ దేశంలో వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది. నైజీరియా ట్విట్టర్​​ బ్యాన్‌పై ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు తమ ఖాతాను ఉపయోగించుకున్నారు. ఇకపై కూడా వీపీఎన్​ ద్వారా ట్విట్టర్‌ను వినియోగిస్తామని.. ప్రభుత్వం నిర్ణయంతో తమకు పనిలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments