చైతన్య రథ సారథి కోసం ఆ ఊరంతా తరలివెళ్లింది...

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన పుట్టిపెరిగిన నిమ్మకూరంతా తరలివెళ్లింది. దీంతో ఆ ఊరి వీధులు ఇపుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.

Written By pnr
Updated: గురువారం, 30 ఆగస్టు 2018 (09:45 IST)
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన పుట్టిపెరిగిన నిమ్మకూరంతా తరలివెళ్లింది. దీంతో ఆ ఊరి వీధులు ఇపుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. 
 
హరికృష్ణ ప్రస్తుతం ఉండేది హైదరాబాద్‌లో అయినప్పటికీ.. ఆయన పుట్టింది, పెరిగింది, చదవింది, బంధాలు, అనుబంధాలు పెంచుకుంది మాత్రం నిమ్మకూరుతోనే. అందుకే ఆయన పదేపదే అనేవాడు.. తాను నిమ్మకూరు బిడ్డనని. దీన్ని రుజువు చేసేందుకే తన భాగస్వామిని కూడా ఆయన నిమ్మకూరువాసినే ఎంచుకున్నారు. 
 
అలాంటి అనుబంధం కలిగిన హరికృష్ణ.. ఇపుడు లేరనే వార్తను నిమ్మకూరు వాసులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఆయన కడసారి దర్శనం కోసం ఊరంతా కదిలిపోవడంతో వీధులన్నీ బోసిపోయాయి.
 
తన వివాహం తరువాత హరికృష్ణ హైదరాబాద్‌కు తరలిపోయినప్పటికీ నిమ్మకూరుతో తన బంధాన్ని చివరిదాకా కొనసాగించారు. తన వాటాగా వచ్చిన భాగంలో ఇల్లు కట్టుకొన్నారు. హాలులో తన తాత, నానమ్మ, తల్లిదండ్రుల నిలువెత్తు ఫొటోలను ఏర్పాటు చేయించారు. తన తండ్రి అప్పట్లో ఉపయోగించిన ఇనుప లాకర్‌ను పదిలంగా దాచుకున్నారు. 
 
రాజ్యసభ సభ్యుడిగా ఉండగా.. రూ.3.50 కోట్లు నిమ్మకూరుకు కేటాయించారు. ఆయన చొరవతోనే గ్రామానికి సిమెంట్‌ రోడ్లు, తారు రోడ్డు, ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు అమరాయి. తాను విద్యనభ్యసించిన బోర్డు స్కూలు, హైస్కూలుకు నూతన భవనాలను హరికృష్ణ కట్టించారు. ఆయన చొరవతోనే నిమ్మకూర దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments