ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (11:48 IST)

భారత ప్రధాని నరేంద్ర మోడీని మాకివ్వాలని అల్లాను ప్రార్థిస్తున్నా.. పాకిస్థాన్ పౌరుడు

modi
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ సనా అంజాద్ తాజాగా చేసిన ఓ ఇంటర్వూలో పాకిస్థాన్ పౌరుడు ఒకడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్రమోడీని తమకిచ్చేలంటూ అల్లాని ప్రార్థిస్తున్నానంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ వస్తేనే తమ దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించాడు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటి పోవడంతో ఆ దేశంలో నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ ఒక్క వస్తువును కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకున్నారు. 
 
మంత్రులు విలాసవంతమైన జీవితాన్ని త్యజించాలని, తమ వద్ద ఉన్న లగ్జరీ కార్లను ప్రభుత్వానికి అప్పగించాలని, విదేశీ పర్యటనల్లో లగ్జరీ హోటళ్లలో బస్ చేయొద్దని, తమ బిల్లులు తామే చెల్లించుకోవాలని, జీతాలు తీసుకోవద్దని ఇలా అనేక ఆంక్షలు విధించారు. మరోవైపు, తమ మిత్రదేశం పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు చైనా ముందుకు వచ్చింది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు భారీగా రుణం ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, పాత్రికేయురాలు సనా అంజాద్ తాజాగా ఓ పోస్టుచేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పాకిస్థాన్ పౌరుడు ఒకరు షేబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు. అదే సమయంలో ఆసక్తిర వ్యాఖ్యలు కూడా చేశారు. అల్లా గనుక భారత ప్రధాని నరేంద్ర మోడీని తమకు ఇచ్చేస్తే పాకిస్థాన్ బాగుడుతుందని పేర్కొన్నాడు. 
 
మాకు మోడీ ఒక్కడు చాలు.. నవాజ్ షరీఫ్ వద్దు, ఇమ్రాన్ ఖాన్ వద్దు, బెనజీర్లు వద్దు, ముషారఫ్‌‍లు వద్దు అని స్పష్టం చేశాడు. మోడీ గనుక పాకిస్థాన్‌ను పాలిస్తుంటే నిత్యావసరాలన్నీ అందుబాటు ధరలకే లభ్యమయ్యేవని ఆ పౌరుడు అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో అనేక మంది పాక్ పౌరులు భారత్‌కు వెళ్లి తలదాచుకున్నా ఫర్వాలేదు.. పాకిస్థాన్‌లో మాత్రం ఉండొద్దనే అనే ప్రచారం ఊపందుకుంటుంది. దీంతో సనా అంజాద్ ఈ కోణంలోనే ఆ పౌరుడిని ప్రశ్నించింది.