పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video
అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఐతే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వాటిని నివారించే ధైర్యం కూడా వుండాలి. చాలామంది ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పారిపోతుంటారు. కొద్దిమంది మాత్రం ఆ ప్రమాదాన్ని భారీ ప్రమాదం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
లారీకి డీజిల్ కొట్టించుకుందామని ఓ లారీ డ్రైవర్ తన వాహనంతో పెట్రోల్ బంకులోకి వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ ఆయిల్ ట్యాంకు పేలి పెద్ద మంటలు చెలరేగాయి. దానితో చాలామంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఒక్కడు మాత్రం ధైర్యంగా అగ్ని ప్రమాదాన్ని అదుపుచేసేందుకు నడుము బిగించాడు. అగ్ని మాపక పరికరంతో ముందుకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాడు. దీనితో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పినట్లయింది. అతడిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.