గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (22:44 IST)

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. హమ్మయ్య ఎవరికీ గాయాల్లేవ్

fire accident
ముంబైలోని గూర్గావ్‌లోని పారిశ్రామిక సముదాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కనీసం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గుర్గావ్‌లోని రామమందిర్ రైల్వే స్టేషన్ వంతెన సమీపంలోని అస్మి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నట్లు వీడియోలు చూపించాయి. బుధవారం సాయంత్రం మృణాల్ తాయ్ గోర్ ఫ్లైఓవర్ సమీపంలోని అస్మి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లోని దుకాణాలలో లెవల్-3 మంటలు చెలరేగాయి. 
 
డీజిల్ గోడౌన్, స్క్రాప్ వస్తువుల దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటన తర్వాత మృణాల్ తాయ్ గోర్ ఫ్లైఓవర్ వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఎవరికీ  గాయాలు కాలేదు.