గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జనవరి 2024 (10:14 IST)

కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో విషాదం - ఏంటో తెలుసా?

amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద అక్క రాజేశ్వరి బెన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె సోమవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి అమిత్ షా తన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. 
 
రాజేశ్వరి బెన్ షా వయసు 60 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
విషయం తెలుసుకున్న అమిత్ షా.. తన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని గుజరాత్‌కు చేరుకుని సోదరి అంత్యక్రియలను పూర్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నగరంలోని తల్తేజ్ శ్మశానవాటికలో రాజేశ్వరి బెన్ షా అంత్యక్రియలను పూర్తి చేశఆరు. అంతకుముందు రాజేశ్వరి భౌతికకాయాన్ని ముంబై నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో తరలించారు.