శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (19:39 IST)

శ్రీనివాస్ గుప్తా సంథింగ్ స్పెషల్.. భార్య లేదని ఆమె మైనపు బొమ్మతో గృహప్రవేశం (video)

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారుచేయించి తను కొన్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం గుస్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే గుప్తాకు ఎనలేని ప్రేమ. అందుకే తన ఇంటి శుభకార్యానికి భార్య మైనపు బొమ్మను చేయించి అందరనీ ఆశ్చర్యపరిచాడు ఈ పెద్దాయన.
 
గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ గుప్తా. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే... నేటి ఈ శ్రీనివాస్ గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు.
భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో నిజంగా శ్రీనివాస్ గుప్తా సమ్ థింగ్ స్పెషల్. ఇంతకీ చెప్తే గానీ తెలిసేలా లేదు.. ఆమె కాదు అది మైనపు బొమ్మ అని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులూ కూడా  అభినందనీయులే..!! నిజంగా గుప్తా భార్య ఎంత అదృష్టమంతురాలో కదా...