శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:44 IST)

కరోనా మహమ్మారిని బయటపడిన ఎంపీ సుమలత

ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు సుమలత కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇపుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారంటూ తనను చాలామంది మిత్రులు, ఇతరులు అడుగుతున్నారని సుమలత వెల్లడించారు. 
 
కరోనా చికిత్సలో మీరు ఎదుర్కొన్న అనుభవాలేంటి? మీ పోరాటం ఎలా సాగింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, అలాంటివారందరి కోసం రేపు ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంటున్నట్టు వివరించారు. 
 
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ చైత్ర సాయంతో అందరి సందేహాలు నివృత్తి చేస్తానని సుమలత వెల్లడించారు. తన కరోనా అనుభవాలు ఏ కొందరికైనా ఉపయోగపడితే అదే చాలని ఆమె తెలిపారు.
 
కాగా, భర్త అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత లోక్‌సభలో ఆమె కర్నాటక రాష్ట్రంలోని మాండ్య స్థానం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.