మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (17:34 IST)

"అది ఇండియన్ సీఈవో వైరస్.. దానికి టీకా లేదు" : ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఆరు యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలకు భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు సీఈవోలుగా పని చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు కూడా సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. దీనిపై భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనదైనశైలిలో స్పందించారు. అది ఇండియన్ సీఈవో వైరస్.. దానికి టీకా లేదు అంటూ చలోక్తి విసిరారు. 
 
స్ట్రైప్ అనే కంపెనీ ఈసీవో ప్యాట్రిక్ కొలిసన్ ఓ ట్వీట్ చేస్తూ, "ఆరు యూఎస్ దిగ్గజ టెక్ కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈవోలుగా నియమితులయ్యారు. ముఖ్యంగా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌‍వర్క్, ఇపుడు ట్విట్టర్ సీఈవోలంతా భారతీయులే. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు ఇంతటి విజయాన్ని చూడటం అద్భుతంగా ఉంది. అంతేకాకుండా వలస వచ్చేవారికి అమెరికా ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది" అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనికి రిప్లైగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. "ఇది భారత్‌లో పుట్టిన మహమ్మారి. ఆ విషయం చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నా. ఆ వైరస్ పేరు "ఇండియన్ సీఈవో వైరస్". దానికి టీకా కూడా లేదు" అంటూ తనదైనశైలిలో ట్వీట్ చేశారు.