పక్షిని భక్షిస్తున్న రాకాసి సాలె పురుగు - వీడియో వైరల్

spider - bird
ఠాగూర్| Last Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:10 IST)
సాధారణంగా ప్రతి ఇళ్ళలో సాలె పురుగులు కనిపిస్తుంటాయి. ఇలాంటివి పెద్దగా హాని చేయవు. కానీ, కొన్ని సాలెపరుగులు విషపూరితమైనవి. ఇలాంటివి కుడితే ప్రాణాలే పోతాయి. తాజాగా ఓ సాలె పురుగు ఏకంగా చిన్నపాటి పక్షిని ఆరగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రపంచంలో ఉన్న సాలీడు జాతుల్లో పిక్ టో టరంటులా అత్యంత పెద్దది అని భావిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం అవిక్యులేరియా అవిక్యులేరియా. ఇవి ఎక్కువగా కోస్టారికా, బ్రెజిల్, దక్షిణ కరీబియన్ దేశాల్లో కనిపిస్తాయి.

ఈ రకం సాలె పురుగును పింక్ టో టరంటులా అని పిలుస్తారు. ఇది చిన్నపాటి పక్షిని భక్షిస్తోంది. తన కాటుతో పక్షి అచేతనంగా మారిపోగా, ఆ పక్షిని తన ముందరి కాళ్లతో పట్టుకుని తింటున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఓ కొయ్య దూలానికి వేలాడుతున్న ఈ సాలీడు తన చేత చిక్కిన పక్షిని నిదానంగా భోంచేస్తూ దర్శనమిచ్చింది. ఆ వీడియోను మీరూ చూడండి.

దీనిపై మరింత చదవండి :