సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By preeti
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (11:55 IST)

బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరు? నాని ఎందుకు వద్దన్నారు?

ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ షో విజయవంతంగా రెండు సీజన్లను ముగించింది. ఇక ఇప్పుడు ఆ టైమ్‌కు పెళ్లి చూపులు అనే ప్రోగ్రామ్ వస్తోంది. ఇక ఇది అయిపోగానే మళ్లీ బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు సీజన్‌

ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ షో విజయవంతంగా రెండు సీజన్లను ముగించింది. ఇక ఇప్పుడు ఆ టైమ్‌కు పెళ్లి చూపులు అనే ప్రోగ్రామ్ వస్తోంది. ఇక ఇది అయిపోగానే మళ్లీ బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు సీజన్‌ల కంటే ఇది భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. 
 
ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ను హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారనే విషయంపై చర్చ ఊపందుకుంది. సీజన్ 1కి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరించగా, 2వ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఎవరి స్టైల్‌లో వారు హోస్ట్ చేసి, ప్రేక్షకులను అలరించడంతో పాటుగా హౌస్‌మేట్స్‌తో సమయస్ఫూర్తి వహిస్తూ ఆకట్టుకున్నారు. అయితే కౌశల్ ఆర్మీ ప్రభావమో ఏమో ఇక 3వ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని అంత ఆసక్తి చూపడం లేదు. ఈ సీజన్‌లో హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు. ఆడియన్స్‌ని అలరిస్తూనే ఇంటి సభ్యుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. 
 
కానీ సీజన్ 3కి కొనసాగే ఆలోచనలో నాని లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం కొత్త హోస్ట్‌ని వెతుక్కోక తప్పదు. సోషల్ మీడియాలో అయితే ఈసారి మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్ ఉండబోతున్నట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్కో సీజన్‌కు ఒక్కో హోస్ట్‌ను మారుస్తున్న నిర్వాహకులు ఈసారి కూడా మరొకరిని హోస్ట్‌గా చేసే అవకాశాలు ఉన్నాయి. 
 
అందులో భాగంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఇప్పటికే అనేక ప్రెస్‌మీట్లు, కార్యక్రమాలలో విజయ్ మాట్లాడే తీరు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇదే విషయంగా అల్లు అర్జున్, రానా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రానా ఇప్పటికే నం. 1 యారి షోతో యాంకరింగ్‌లో అనుభవం సంపాదించుకున్నారు. మొత్తానికి ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.