శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (14:02 IST)

#WorldSuicidePreventionDay ప్రతి 40 సెకన్లకు ఒకరు సూసైడ్ అటెంప్ట్

జీవితం జయాపజయాల కలయిక. సుఖం వెంటే దుఃఖం.. కష్టం వెంటే సంతోషం. సూర్యచంద్రుల్లా వస్తూవుంటాయి. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కష్టాలు తప్పవు. చిన్న చీమ నుంచి చిరుతపులి వరకు నిత్యం పోరాడుతూనే జీవిస్తూ ఉంటాయి తప్పా ఆత్మహత్యకు పాల్పడవు. కానీ, సృష్టిలో అన్నిటికంటే తెలివైనవాడిని, విశ్వాన్నే జయించగలను అని బీరాలు పలికే మనిషి మాత్రం తనకొచ్చే చిన్న సమస్య ముందు తలవంచి నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నాడు. ప్రపంచ ఆత్మహత్య దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు చేసుకునే వారి లక్షణాలు ఏవిధంగా ఉంటాయి. ఆత్మహత్యల ఆలోచలన నుంచి వారి దృష్టిని ఏవిధంగా మరల్చాలో ఇపుడు తెలుసుకుందాం. 
 
2003 నుంచి ప్రతి యేడాది సెప్టెంబరు పదో తేదీన అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేటా 10 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 15 యేళ్ల నుంచి 30 యేళ్ళ లోపు వారే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తుంటే, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. 
 
పైగా, పురుషుల కంటే మహిళలు అధికంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కానీ చనిపోయే వారి సంఖ్య మాత్రం మహిళల కంటే పురుషులకే అధికంగా ఉంది. ఫలితంగా సగటున ప్రతి రోజూ దాదాపు మూడు వేల మంది చనిపోతున్నారు. ఈ ఆత్మహత్యలకు పాల్పడేవారు క్షణికావేశంలో కొందరు, పనిలో ఒత్తిడి కారణంగా ఒకరు, కోరుకున్నవారు దక్కలేదని మరొకరు, చదువుల్లో రాణించలేకపోయామని కొందరు, కుటుంబ భారం మోయలేక ఇంకొందరు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఆత్మహత్య అనే భావన క్షణికావేశంలో రాదనీ, మనసులో ఎప్పటి నుంచే సుడులు తిరిగినట్టుగా తిరుగుతూ ఉండటం వల్లే ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.