Daily Horoscope
✕

వైఎస్ జగన్ భారతి పెళ్లిరోజు.. సిమ్లాలో 25వ వివాహ వార్షికోత్సవం

Written By సెల్వి
Updated: శనివారం, 28 ఆగస్టు 2021 (09:10 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు స్పెషల్ డే. ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం.. ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఈ నెల 28వ తేదీన అంటే శనివారం వైఎస్‌ జగన్‌ జీవితంలో స్పెషల్‌డే. అదే జగన్‌-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు మాత్రమే కాదు.. సిల్వర్‌ జూబ్లీ జరుపుకోనున్నారు.
 
వైఎస్‌ జగన్‌-భారతి పెళ్లి జరిగి 25 ఏళ్లు కావస్తుంది.. ఈ సందర్భంగా.. రాజకీయాలు, సీఎం బాధ్యతలకు దూరంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీతో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ దంపతులు సిమ్లాలో తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటికే వారు కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు.
 
కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ సిమ్లా ట్రిప్పుకు వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడే సీఎం పర్యటన వుంటుంది. ఇకపోతే.. ఆగస్టు 28, 1996 ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల మధ్య వైఎస్ జగన్-భారతిల వివాహం ఘనంగా జరిగింది. అదే ముహూర్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరిపించారు. 
 
కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించారు. 
 
జగన్ వివాహ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఇక వైఎస్ భారతి పులివెందులకే చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె. వైఎస్ జగన్-భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు హర్షారెడ్డి, వర్షా రెడ్డి. 
 
ఇక జగన్ పెళ్లి రోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు సహా సోషల్ మీడియా కార్యకర్తలు సైతం జగన్ భారతి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువలా కురిపిస్తున్నారు.

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments