మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By ivr
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (20:14 IST)

మోదీకి ఒకే ఒక్క ఛాన్స్... మిస్ చేస్కుంటే అంతే... ఏంటది?

వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2018 పరిపూర్ణమైన బడ్జెట్ కాబోతోంది ఎన్డీయే సర్కారుకు. ఎందుకంటే వచ్చే 2019లోనే మోదీ సర్కార్ ఎన్నికలను ఎదుర్కోవలసి వుంటుంది. కాబట్టి 2018 బడ్జెట్ చాలా కీలకమైనది. ఈ బడ్జెట్లో మోదీ ప్రజలను ఆకట్టుకునేందుకు పూర్తి కసరత్త

వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2018 పరిపూర్ణమైన బడ్జెట్ కాబోతోంది ఎన్డీయే సర్కారుకు. ఎందుకంటే వచ్చే 2019లోనే మోదీ సర్కార్ ఎన్నికలను ఎదుర్కోవలసి వుంటుంది. కాబట్టి 2018 బడ్జెట్ చాలా కీలకమైనది. ఈ బడ్జెట్లో మోదీ ప్రజలను ఆకట్టుకునేందుకు పూర్తి కసరత్తు చేయాల్సి వుంది. ఇందులో ఏమాత్రం ఫెయిల్ అయితే మాత్రం ఆ తదుపరి ఎన్నికల్లో దాని ప్రభావం చూపించ మానదు. 
 
ఇప్పటికే దేశంలో GST, Demonitization పైన వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ అదేమీ లేదని పాలకులు చెప్పుకుంటున్నారనుకోండి. కానీ పెద్దనోట్ల దెబ్బ చాలా రంగాలను కుదేలు చేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి మూలుగుతోంది. దేశంలో చాలాచోట్ల రియల్టర్లు నష్టాల ఊబిలో కూరుకుని అప్పులుపాలయిన ఉదంతాలు వెలికి వస్తున్నాయి. ఇకపోతే GST గురించి ఏకంగా తమిళనాడులో సినిమా కూడా వచ్చేసింది. 
 
మెర్సల్ అంటూ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన జీఎస్టీపై సెటైర్లు విసరడంతో అది పెద్ద వివాదమైంది. ప్రజలు ఆ చిత్రానికి జేజేలు పలికారు. దీన్నిబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏస్థాయిలో వున్నదో అర్థమవుతుంది. కాబట్టి జీఎస్టీలో వున్న లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం మోదీ సర్కారుపై వుంది. వీటితో పాటు యువతకు ఉపాధి కల్పనకు తీసుకోవలసిన చర్యలు చాలానే వున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే వచ్చే Budget 2018లో నరేంద్ర మోదీ పూర్తిగా కసరత్తు చేసి వెళితేనే ఫలితాలు వుంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొన తప్పదు.