గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (16:53 IST)

వాలెంటైన్స్ డే స్పెషల్.. టెడ్డీబేర్ గిఫ్ట్ ఎందుకో తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్రేమ జంటలే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే.. పార్కులు, సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లోనే అధికంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. దీనికి తోడుగా అంటే.. ఇక రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ప్రేమికులందరు ఆ రోజుకోసం ఎంతో వేచి చూస్తున్నారు. అలాంటి వారికోసం కొన్ని విషయాలు..
 
ప్రేమికులకు హగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటివారికి ప్రేమికుల దినోత్సవం చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. ఎందుకుంటే.. ఆ రోజు వారు ఇచ్చుపుచ్చుకునే బహుమతులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటిగా టెడ్డీబేర్. వెచ్చని కౌగిలి కోరుకునే వాళ్లు ఈ బహుమతిగా ఇస్తారట. టెడ్డీబేర్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది.
 
ఎవ్వరికైనా దాన్ని చూడగానే గట్టిగా పట్టుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. అలానే.. ప్రేమికులు ఒకరినొకరు విడిచి ఉండలేం అని చెప్పేందుకు ఈ బహుమతిని ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే రోజు.. ప్రేమికులకు ఓ మంచి ఫీల్ కలగడానికి ఈ బహుమతి మంచి ఆప్షన్ అని ప్రేమ పండితులు చెప్తున్నారు.