ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:53 IST)

వాలెంటైన్స్ డే రోజు.. ఎలాంటి బహుమతులు ఇవ్వాలి..?

ప్రేమ అంటే.. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడమే కాదు.. కష్టనష్టాలను పంచుకునేవారు ప్రేమికులు. నేటి తరుణంలో ఈ ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఈ నెల 14వ తేదీనా ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఈ రోజు ప్రేమికులకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రేమికులందరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. ఆ బహుమతుల్లో ముఖ్యమైనది గులాబీ పువ్వు.
 
గులాబీ పువ్వులు ప్రేమకు చిహ్నాలని చెప్తుంటారు. ఒక్కో గులాబీకో అర్థం ఉంటుంది. కానీ ఎరుపు గులాబీ పువ్వుకు మాత్రం సంప్రదాయ ప్రేమికుల దినోత్సవానికి బహుమతిగా ఇచ్చుకుంటారు. ఎర్ర గులాబీ మానవ గుండెకి ఏదో సంబంధం ఉందని కొందరి మాట. అందుకే ప్రేమికులు ఒకరికొకరు ఎరుపు గులాబీలు ఇచ్చుకుంటే.. ఒకరి గుండె మరొకరికి ఇచ్చినట్టవుతుందని నమ్ముతారు. 
 
గులాబీతో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చుకుంటారు. ప్రేమికులకు బహుమతుల్లో మొదటిగా చాక్లెట్స్‌కే ప్రాధాన్యం. పైగా వీటిని చాలా విలువైన బహుమతిగా తీసుకుంటారు. అమ్మాయిల్లానే.. చాక్లెట్స్ కూడా సున్నితంగా ఉంటాయని చెప్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. మనసులోని కోరికలను ఉత్తేజపరచడంలో వీటిదే ప్రథమ స్థానం. ఆ చాక్లెట్స్ కూడా ఎలాంటివంటే.. హార్ట్ షేప్‌లో ఉండేవి. ఒక్క గులాబీ పువ్వు, హార్ట్ షేప్ చాక్లెట్స్ మీ ప్రియమైన వారికి ఇస్తే. అంతకు మించిన సంతోషం మరొకటి ఉంటుంది.