సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:57 IST)

అప్పులను తీర్చే లాఫింగ్ బుద్ధా.. కలబంద...?

అవును. అప్పులు తీరిపోవాలంటే లాఫింగ్ బుద్ధాను వాస్తు ప్రకారం ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. ఇంట ఆర్థిక సమస్యలున్నప్పుడు, అప్పులు తీరాలంటే.. లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. 
 
ఇలా చేస్తే అప్పుల బాధలు తీరడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా సుఖసంతోషాలు చేకూరుతాయి. లాఫింగ్ బుద్ధా కష్టాలను మూటగట్టి ఆనందాన్ని ఇంట్లోకి తీసుకువస్తారని విశ్వాసం.
 
ముఖ్యంగా దుకాణం ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాను పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
 
అంతేగాకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునే వారికి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దీనిని సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఇవి ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించేలా చేస్తాయి. కలబంద అదృష్టాన్ని ఇస్తుందని.. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది.