బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 జనవరి 2020 (22:25 IST)

అలాంటి ఇంట్లో డబ్బు నిలవదు...

తూర్పున ఓ గృహం, దక్షిణాన ఓ గృహం నిర్మించి ఆగ్నేయంలో గృహం లేనట్లయితే దాన్ని ధూమరంధ్రం అంటారు. అలాంటి ఇంటిలో సంతోషం అనేది కనబడదు. దక్షిణంలో ఓ గృహం, పడమట మరో గృహం కట్టినట్లుయితే ఆ గృహాన్ని అసురరంధ్ర అంటారు. అలాంటి గృహంలో మేలు జరుగదు. 
 
పశ్చిమోత్తరముల కట్టిన ఇల్లు వాయురంధ్రము అవుతుంది. దీనివల్ల కార్యహాని జరుగుతుంది. ఉత్తర పూర్వములందు కట్టిన ఇల్లు కాకరంధ్రమనీ, ఇలాంటి ఇంట్లో కార్యాలన్నీ భగ్నమవుతాయని వాస్తు శాస్త్రం చెపుతోంది. తూర్పున, పడమరలో కట్టిన ఇల్లు పల్లీగృహం అంటారు. ఇలాంటి ఇంట్లో డబ్బులు నిలవవు. దక్షిణం, ఉత్తరంలో ఇల్లు వున్నట్లయితే అది దాయాదులతో పోట్లాటలు తెస్తుంది.