సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (11:51 IST)

ముల్లంగి రైతా తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
ముల్లంగి - 2
టమోటో - 1
ఉల్లిపాయ తరుగు - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
పెరుగు - 3 కప్పులు
ఎండుమిర్చి - 2
జీరాపొడి - అరస్పూన్
జీలకర్ర - అరస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా టమోటా, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ఆపై ముల్లింగిని తురుముకోవాలి. ఇప్పుడు పెరుగులో ఈ ముల్లంగి ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో దీనిని కలుపుకోవాలి. అంతే... ముల్లంగి రైతా రెడీ.