నేరేడు పండ్ల గుజ్జు, పటికబెల్లంతో.. దగ్గు పరార్..!
నేరేడు పండ్లు దివ్యౌషధాలను కలిగివుంటాయి. నేరేడు పండ్లు లివర్‌కు మేలు చేస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తూ చేరే తల వెంట్రుకలు, లోహపు ముక్కలను కూడా అల్లనేరేడు పండ్లు కరిగిస్తాయి. నేరేడు పండ్ల గింజల పొడిని కషాయంగా కాచి అందులో పాలు, తాటి కలకండ కలిపి నిత్యం రెండు పూటలా తాగితే అతి మూత్రం, మధుమేహం అదుపులోకి వస్తాయి.
అల్లనేరేడు చెట్టు బెరడు లేదా పుల్లలతో దంతాలను తోముకుంటే దంత సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అల్ల నేరేడు గింజల చూర్ణంలో కొద్దిగా ఉప్పు కలిపి దాంతో దంతాలను తోముకోవచ్చు. అల్లనేరేడు పండ్లు మధుమేహాన్నితగ్గిస్తాయి. ఆ పండ్ల విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది.
నేరేడు పండ్ల గుజ్జు, పటికబెల్లం కలిపి సన్నని మంటపై వేడి చేసి పాకంలా తయారు చేసుకుని, రోజూ 2 టీస్పూన్ల మోతాదులో ఈ మిశ్రమాన్ని తీసుకుని, అర గ్లాసు మంచినీటిలో కలిపి సేవిస్తుంటే ఎంతటి తీవ్రమైన దగ్గు సమస్య అయినా తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.