మహిళల్లో పైల్స్ రావడానికి కారణాలు ఏమిటి?
మహిళల్లో పైల్స్ సమస్య. ఆసన ప్రాంతంలో నొప్పి, వాపు లేదా దురదగా వుంటుంది. మల ద్వారం నుంచి రక్తం పడటం, కూర్చోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటే పైల్స్ సమస్య వున్నట్లు అనుకోవచ్చు. పైల్స్ లేదా హేమోరాయిడ్‌లు రావడానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ప్రేగు కదలికల సమయంలో చాలా ఒత్తిడికి గురవడం వల్ల సమస్య తలెత్తుతుంది. ఇప్పటి పనుల్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయాల్సి వస్తుంది. ఇలా కూర్చుని వుండటం కారణం. అలాగే దీర్ఘకాలిక మలబద్ధకం, క్రానిక్ డయేరియా, అధిక బరువు సమస్య కూడా పైల్స్ సమస్యను తెస్తాయి. ఇంకా వృద్ధాప్యానికి సమీపించడం, తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవడం, గర్భం ధరించడం వల్ల కూడా రావచ్చు.
పైల్స్ లక్షణాలు తీవ్రతరమైనప్పుడు క్రింద వివరించిన విధంగా ఉంటాయి
ఆసనంలో విపరీతమైన నొప్పి కూర్చోవడం చాలా కష్టం.
మలానికి వెళ్లేటప్పుడు రక్తం పడవచ్చు.
ఆసన ప్రారంభ లేదా పురీషనాళంలో దురదగా వుంటుంది.
శ్లేష్మ ఉత్సర్గ సమస్య కనిపిస్తుంది.
మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ వెళ్లాలనిపిస్తుంది.