ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (17:31 IST)

ఉల్లిపాయ ముక్కల్లో కాస్త పంచదార వేస్తే....

ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కాస్త పంచదారను ఆ ముక్కలలో కలుపుకుంటే మంచిది. క్యాబేజీ త్వరగా ఉడకాలంటే చిటికెడు వంటసోడా వేస్తే సరిపోతుంది. క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లంముక్క వేస్తే చెడు వాసన రాదు.

ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కాస్త పంచదారను ఆ ముక్కలలో కలుపుకుంటే మంచిది. క్యాబేజీ త్వరగా ఉడకాలంటే చిటికెడు వంటసోడా వేస్తే సరిపోతుంది. క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లంముక్క వేస్తే చెడు వాసన రాదు. కూరగాయలు, ఆకుకూరలు పచ్చదనం కోల్పోకుండా ఉండాలంటే ఉడకపెట్టేటప్పుడు చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే చాలు.
 
బెండకాయలు వండేటప్పుడు కనీసం అరగంట ముందు వాటిని కడిగి ఆరబెడితే కూరలో జిగురు ఉండదు. బెండకాయ కూర కరకరలాడుతుండాలంటే ముందురోజు రాత్రి వాటిని తరిగిఉంచుకుని మర్నాడు కూర చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
 
ఉడకబెట్టిన పొట్టుతీసిన ఆలుగడ్డలు నల్లబడకుండా వుండాలంటే కాస్త ఉప్పు నీటిని చల్లాలి. బఠానీలను ఎనిమిది గంటల పాటు నానబెట్టితే రెండు రెట్లు విటమిన్లు పెరుగుతాయి.