శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:40 IST)

అభిమాని వెంటపడి.. తరిమి తరిమి కొట్టిన బాలకృష్ణ

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ హీరో, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోమారు తన దురుసు ప్రవర్తనతో వార్తలకెక్కారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఓ అభిమాని వెంటపడి తరిమి తరిమి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగింది. 
 
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న బాలకృష్ణ ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అపుడు ఆయన తన చేతిదూలను ప్రదర్శించారు. బాలకృష్ణను తన కెమెరాల్లో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించిన అభిమానులపై ఆయన చేయి చేసుకున్నారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుపై నడుస్తూ వెళుతున్న బాలకృష్ణను ఓ అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన బాలయ్య... ఆ ఫోన్ లాక్కొనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడంతో అతని వెంటపడి దాడి చేశారు. సుమారు 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలకృష్ణ చేసిన పనిని నెటిజన్లు విమర్శిస్తున్నారు.