మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (12:56 IST)

కలుషిత ఆహారం ఆరగించిన 26 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల అస్వస్థత

food poision
కలుషిత ఆహారం ఆహారం ఆరగించిన 26 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీ వసతి గృహంలో చోటుచేసుకుంది.
 
ఈ హాస్టల్‌‍లో మంగళవారం రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమోటా రైస్‌, పెరుగన్నం ఆరగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించారు. 
 
అందులో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్‌ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.